ఈరోజు బొమ్మనపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ, రవాణాశాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారి సిపారస్ మేరకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ లు తాటిపాముల లత (దేశిని తిరుపతమ్మ) గారికి 60,000 వేలు, భోజ లక్ష్మీపతి గారికి 16,500 రూపాయలు గ్రామ సర్పంచ్ శ్రీమతి కొంకట మౌనిక చక్రధారి మరియు కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు మాచమల్ల రమణయ్య గార్లు అందజేసినారు. ఈ కార్యక్రమంలో 12వ వార్డ్ సభ్యులు బడుకోలు దేవేందర్ రెడ్డి, 9వ వార్డ్ సభ్యులు సుకోషి పద్మ సమ్మయ్య, 2వ, వార్డ్ సభ్యులు చట్ల శృతి, 10వ వార్డ్ సభ్యులు కొంకట బిక్షపతి, 11వ వార్డ్ సభ్యులు అందె సంపత్, గ్రామ పంచాయితీ కార్యదర్శి వేముల నాగరాజు, మడమడకల రాజిరెడ్డి, మాచమల్ల కిషోర్, చట్ల శ్రీకాంత్, చట్ల మొగిలి, గన్మెన్ కనకయ్య, భోజ త్రివేణి, మీ సేవ రమేష్, గాజుల ఆనందరెడ్డి, మొలుగూరి దామోదర్, నన్నె రాకేష్, తదితరులు పాల్గొన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ అందజేసిన గ్రామ సర్పంచ్






